![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెడర్స్ కి బదులుగా వాళ్ళ జోడి టాస్క్ ఆడుతారు. అందులో మొదటగా ఇమ్మాన్యుయల్ టీమ్ అయినా భరణి రేస్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత హరీష్ జోడి పవన్ కళ్యాణ్, డిమాన్ పవన్ జోడి ప్రియ తప్పుకుంది.
చివరగా రాము, శ్రీజ ఇద్దరు ఉంటారు. రాము టఫ్ ఫైట్ ఇస్తాడు కానీ తప్పుకుంటాడు. ఫైనల్ గా శ్రీజ గెలుస్తుంది. శ్రీజ కెప్టెన్ అవ్వదు తన జోడీ సంజన కెప్టెన్ వుతుంది. సంచాలక్ మనీష్ కెప్టెన్సీ బ్యాండ్ ని సంజనకి పెడతాడు. సంజన కెప్టెన్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే తనకి ఓనర్స్ తో పాటుగా వారం రోజుల పాటు అన్ని లగ్జరీస్ ఉంటాయని బిగ్ బాస్ చెప్పాడు. ఇక అందరు నేను చెప్పినట్టు వినాలి ముఖ్యంగా ఇప్పుడు నేను స్పెషల్ రూమ్ కి వెళ్తున్నాను కాబట్టి నా సామాను అంతా ఎవరు షిఫ్ట్ చేస్తారు.. ఇద్దరు హెల్పర్స్ కావాలని సంజన ఆర్డర్ వేస్తుంది.

నేను చేస్తాను ఎందుకంటే కెప్టెన్సీ కంటెండర్ గా నాకు ఛాన్స్ ఇచ్చారు కదా అని ఇమ్మాన్యుయల్ అంటాడు. ఇంకొకరు ఫ్లోరా సైని చెయ్యాలని సంజన అనగానే నేను చెయ్యనని ఫ్లోరా సమాధానం చెప్తుంది. చూసారా నేను అడిగితే ఎలా చెప్తుందో.. చూసుకుంటానన్నట్లు ఒక లుక్ ఇస్తుంది సంజన. దీన్ని బట్టి చూస్తే సంజన వల్ల ఈ వారం రోజులు కంటెస్టెంట్స్ కి చుక్కలే అని అర్థమవుతుంది.
![]() |
![]() |